Join Now Join Now

Free Bus Scheme: ఏపీ మహిళలకు శుభవార్త ఉచిత బస్సు ప్రయాణం అమలు వివరాలు చెప్పిన మంత్రి

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్ మహిళలకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించనుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామన్నారు.

ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఎప్పటి నుంచి అమలు?

మరోవైపు ఉగాది నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఏపీఎస్ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి ఆరో తేదీ జరిగే ఏపీ కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నాయి.

ap free bus scheme start dateఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ – రూ. 20,000 ఆర్థిక సాయం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం నేపథ్యం

Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు టీడీపీ కూటమి సర్కారు త్వరలోనే శుభవార్త వినిపించనుంది. ఏపీ ఎన్నికల సమయంలో మహిళల కోసం అనేక హామీలు ప్రకటించిన టీడీపీ కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా మహిళల కోసం మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంపై ఫోకస్ పెట్టింది.

ap free bus scheme start dateవారికి రూ.15000.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ..


మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మంత్రి ఏమన్నారంటే?

ఈ విషయాన్ని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి మండిపల్లి చెప్పారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మండిపల్లి తెలిపారు. ఉచిత బస్సు పథకాన్ని విజయవంతంగా అమలుచేసేందుకు ఇప్పటికే అమలవుతున్న రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు.

ap free bus scheme start dateఅందరికి ఇల్లు పథకం ద్వారా ఫిబ్రవరి 1 నుండి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణి


ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉపసంఘం నివేదిక – Free Bus Scheme

ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఉచిత బస్సు పథకం అమలవుతున్న కర్ణాటకలో ఇప్పటికే పర్యటించామన్న మంత్రి మండిపల్లి.. అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసినట్లు, కర్ణాటక రవాణాశాఖ అధికారులతో వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. త్వరలోనే ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ap free bus scheme start dateఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త..30 నుంచి రూ.78 వేల వరకు రాయితీ ఇప్పుడే అప్లై చెయ్యండి


మరోవైపు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఉగాది నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను తయారు చేసిందని.. ఈ రిపోర్టును ప్రభుత్వానికి అందించినట్లు తెలిపాయి. ఫిబ్రవరి ఆరో తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై ఏపీ ప్రభుత్వం చర్చిస్తుందని.. ఆ తర్వాత ఉగాది నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి.

ap free bus scheme start dateమహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలో అకౌంట్లలోకి డబ్బులు, గ్రామాల వారీగా లిస్టు రెడీ..!

Related Tags: ఉచిత బస్సు ప్రయాణం, ఏపీ మహిళలు, ఉగాది, ఆర్టీసీ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

2 thoughts on “Free Bus Scheme: ఏపీ మహిళలకు శుభవార్త ఉచిత బస్సు ప్రయాణం అమలు వివరాలు చెప్పిన మంత్రి”

  1. అమ్మఒడి అనేది చాలా high priority scheme ముందు దానికి పచ్చ జెండా ఉపండి…

    Reply

Leave a Comment